మద్రాస్‌‌ హైకోర్ట్‌‌ చీఫ్‌‌ జస్టిస్‌‌ రాజీనామా

madras-high-court-chief-justice-sends-resignation-papers-to-president

రాష్ట్రపతికి రిజిగ్నేషన్‌‌ లెటర్‌‌ పంపిన జస్టిస్‌‌ తహిల్‌‌ రమణి

న్యూఢిల్లీ: మద్రాస్‌‌ హైకోర్ట్‌‌ చీఫ్‌‌ జస్టిస్‌‌ విజయ్‌‌ కె. తహిల్‌‌రమణి  రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని ప్రెసిడెంట్‌‌ రామ్‌‌నాథ్‌‌ కోవింద్‌‌కు శనివారం పంపారు. దాని కాపీని సుప్రీంకోర్టు చీఫ్‌‌ జస్టిస్‌‌ రంజన్‌‌ గొగొయ్‌‌కి శుక్రవారం రాత్రే పంపారని అధికారవర్గాలు చెప్పాయి.  జస్టిస్‌‌  తహిల్‌‌ రమణిని మేఘాలయ హైకోర్ట్‌‌ చీఫ్‌‌ జస్టిస్‌‌గా ట్రాన్స్‌‌ఫర్‌ చేయాలని  చీఫ్‌‌ జస్టిస్‌‌ గొగొయ్‌‌ ఆధ్వర్యంలోని కొలీజియం గతనెల 28న సిఫార్సు చేసింది. ఆ ప్రపోజల్‌‌ను మరోసారి ఆలోచించాలని కొలీజియంకు జస్టిస్‌‌  తహిల్‌‌ రమణి  రిక్వెస్ట్‌‌ చేశారు.  ఆ తర్వాత కొలీజియం  నిర్ణయంపై ఆమె నిరసన కూడా తెలిపారు.  మేఘాలయ లాంటి చిన్న రాష్ట్రానికి చీఫ్‌‌ జస్టిస్‌‌గా పంపడంపై కలత చెందే ఆమె తన పదవికి రాజీనామా చేశారని తెలుస్తోంది.

  • బొంబాయి హైకోర్టు జడ్జిగా జూన్‌‌ 26, 2001గా  నియామకం.
  • గత ఏడాది ఆగస్టు 8న పదోన్నతిపై మద్రాస్‌‌ హైకోర్టు చీఫ్‌‌ జస్టిస్‌‌ నియామకం.
  • అక్టోబరు 2, 2020లో రిటైర్‌‌మెంట్‌‌ .

సుప్రీంకోర్టు కొలీజియంలో సభ్యులు

  • చీఫ్‌‌ జస్టిస్‌‌ రంజన్‌‌ గొగొయ్‌‌, జస్టిస్‌‌ ఎన్‌‌.వి. రమణ, జస్టిస్‌‌ అరుణ్‌‌ మిశ్రా, జస్టిస్‌‌ ఆర్‌‌.ఎఫ్‌‌. నారిమన్‌‌.

హైకోర్టు చీఫ్‌‌ జస్టిస్‌‌ స్థాయికి చేరుకున్న మహిళా జడ్జీలు దేశంలో చాలా తక్కువ మంది ఉన్నారు.   75 మంది జడ్జిలున్న కోర్టు నుంచి  కేవలం ఇద్దరు జడ్జిలున్న మేఘాలయకు ట్రాన్స్‌‌ఫర్‌‌ చేయడమన్నది రొటీన్‌‌ ట్రాన్స్‌‌ఫర్‌‌గా చూడలేం. జ్యుడీషియల్‌‌ నియామకాల్లో, బదిలీల్లో  పారదర్శకత లేదన్నది జస్టిస్‌‌ రమణి  రాజీనామా ఇష్యూ రుజువు చేస్తోంది. – సీపీఎం పోలిట్‌‌బ్యూరో మెంబర్‌‌ బృందా కారత్‌‌

Madras High Court Chief Justice Sends Resignation Papers To President

Latest Updates