రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషి పెరరివళన్ కు బెయిలు

మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసు దోషి పెరరివళన్‌ అలియాస్‌ అరివుకు మద్రాస్‌ హైకోర్టు  30 రోజుల పెరోల్‌ మంజూరు చేసింది. తోటి ఖైదీలు ఎక్కువ సంఖ్యలో కరోనా బారిన పడటంతో.. అతని తల్లి అర్పుతమ్మల్‌ కొడుకు ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసింది. పెరోల్‌ కోరుతూ నెలల క్రితం మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించింది. పెరరివళన్‌ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా 90 రోజుల పెరోల్‌ కోరుతూ పిటిషన్‌ దాఖలు చేసింది. జైలు నిబంధనల కింద పెరోల్‌ ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం నిరాకరించినప్పటికీ జస్టిస్‌ ఎన్‌ కిరుబకరన్‌, జస్టిస్‌ పి వెల్మురుగన్‌ డివిజన్‌ బెంచ్‌ అతనికి పెరోల్‌ మంజూరు చేయాలని ఆదేశించింది. రాజీవ్‌ గాంధీ హత్యకు కారణమైన బాంబు తయారీకి ఉపయోగించిన రెండు 9 వోల్ట్‌ బ్యాటరీలను అందించిన కారణంతో 1991 లో పెరరివళన్ను కోర్టు దోషిగా నిర్దారించింది.

Latest Updates