నళిని పెరోల్ పొడిగింపునకు కోర్టు నిరాకరణ

మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న నళిని  పెరోల్‌ పొడిగింపునకు మద్రాసు హైకోర్టు నిరాకరించింది. తన కూతురు వివాహం సందర్భంగా మరో నెల రోజులు పెరోల్‌ పొడిగించాలని నళిని కోర్టును ఆశ్రయించింది. అయితే నళిని అభ్యర్థనను ఇవాళ(గురువారం) కోర్టు తోసిపుచ్చింది. ఆమె పెరోల్‌ గడువు ఈ నెల 15వ తేదీతో ముగియనుంది. 1991 నుంచి వేలూరులోని జైలులో నళిని శిక్ష అనుభవిస్తోంది.

రాజీవ్ గాంధీ హత్యకేసులో జీవితకాల శిక్షను అనుభవిస్తున్న నళినికి.. ఆమె కూతురి విహహం కారణంగా జూలై 25న 30 రోజుల పెరోల్‌ను కోర్టు మంజూరు చేసింది. తన కూతురి పెళ్లి ఏర్పాట్లు పూర్తి కానందున మరింత సమయం కావాలంటూ ఆగస్టులో ఆమె మరోసారి కోర్టును ఆశ్రయించింది. దీంతో నళిని పెరోల్ గడువును మరో మూడు వారాలపాటు పొడగిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది.

మరోసారి అక్టోబర్ 15 వరకు తన పెరోల్‌ను పొడగించాలంటూ కోర్టులో ఆమె పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై ఇవాళ (గురువారం,సెప్టెంబర్-12) విచారణ జరిపిన మద్రాసు హైకోర్టు ఆమె అభ్యర్థనను తిరస్కరించింది.

 

Latest Updates