కనికట్టు చేసే ‘త్రీడీ కళ’

అందుకే దాన్ని కళ అంటారు. ఏం చేసినా ఎంత పద్ధతిగా, ఒద్దికగా, చూడగానే వావ్ అనిపించేలా చేసే ‘కళ’ అతి కొద్ది మందికి మాత్రమే సొంతం. ఈ త్రీడీ ఆర్ట్ ను చూస్తే కూడా అదే అనిపించకమానదు. అక్బర్ మోమిన్ .. మనకు అంతగా తెల్వదు గానీ మంచి పేరున్న ఆర్టిస్టే నట. ఆయన వేసిన ఆర్ట్ చూస్తే ఏదో మ్యాజిక్ చేసినట్టు అనిపిస్తుందంటే చాలా మంది నమ్మరేమో. అక్బర్ వేసిన ఈ త్రీడీ పెయింటింగ్ వీడియోను ఓ నెటిజన్ ట్వి ట్టర్ లో షేర్ చేశాడు. టాలెంట్ అంటే ఇది కదూ.. ఎవరీ ఆర్టిస్ట్ అంటూ ఆ యూజర్ కామెంట్ పెట్టాడు. అప్పట్నుంచి అది తెగ వైరల్ అయిపోతోంది. నెటిజన్లు ఆయన్ను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నా రు. అమితాబ్ బొమ్మను గీస్తున్నట్టుగా ఓ వ్యక్తి చేతిలో బ్రష్ పట్టుకున్న దగ్గర్నుంచి మొదలవుతుంది వీడియో. అక్కడ అంతగా ఏమీ అనిపించదు.

అప్పుడే డోర్ తీసుకుని మరో వ్యక్తి (ఆయనే అక్బర్ ) లోపలికి వస్తాడు. బ్రష్ పట్టుకుని కూర్చున్న వ్యక్తి దగ్గరకు వెళ్తాడు. అక్కడి నుం చి మొదలవుతుంది మ్యాజిక్. అతడి చేతిలో ఉన్న బ్రష్ దగ్గర్నుంచి బ్రష్ తీస్తాడు. ఆ తర్వాత చెప్పులు తొడుక్కుంటాడు. ఆ వెంటనే కూర్చున్న స్టూల్ ను తీసుకుంటాడు. దర్జాగా దాని మీద కూర్చుని తాను ఓ పోజ్ పెట్టాడు. తీరిగ్గా గోడమీద ఫొటో చూశారు కదా..దానిపై నుంచి ఇంకో ఫ్రేమ్ తీస్తాడు. అప్పుడుగానీ ఆ ఆర్ట్ లోని మ్యాజిక్ చాలా మందికి అర్థం అయి ఉండదు. అంతలా ఆర్ట్ లో ఇమిడాయవి. ఈ వీడియో బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కంట పడిందో లేదో. చూస్తే ఆయన రియాక్షన్ ఎలా ఉంటుందో! ఇలా ఎంత చెప్పుకుంటూ పోయినా తక్కువేగానీ.. దాంట్లోని మ్యాజిక్ తెలియాలంటే ఒక్కసారి ఆ వీడియోను చూసేయాల్సిందే.

Latest Updates