పూజారులపై మూక దాడి.. ఆలయంలో దోపిడీ

  • మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఘటన

ముంబై: మహారాష్ట్రలో మూకదాడులు కొనసాగుతున్నాయి. పాల్ఘర్ జిల్లాలోని బలివాలిలో ముగ్గురు గుర్తు తెలియని దుండగులు ఇద్దరు పూజారులపై దాడి చేసి ఆలయాన్ని దోచుకున్నారు. నాందేడ్ జిల్లాలో ఒక సాధువు, అతని శిష్యుడిని కొట్టి చంపిన ఘటన జరిగి వారం గడువక ముందే ఈ దారుణం శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం తెల్లవారుజామున ముగ్గురు వ్యక్తులు ఆయుధాలతో బలివాలి లోని జాగ్రుత్ మహాదేవ్ మందిర్ లోకి ప్రవేశించి ఆలయ ప్రధాన పూజారి శంకరానంద సరస్వతి, అతని సహాయకుడిపై దాడి చేశారని తెలిపారు. వారు దాడి ప్రారంభించగానే ఇద్దరు పూజారుల్లో ఒకరు గుడిలోని గదిలోకి వెళ్లి తలుపు వేసుకున్నాడని, మరొక పూజారి ప్రాంగణం నుంచి బయటకు పరిగెత్తి తమను తాము కాపాడుకున్నారని అధికారి తెలిపారు. దుండగులు రూ .6,800 విలువైన విలువైన వస్తువులతో పరారయ్యారని, వారి మీద పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు విరార్ పోలీస్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ తెలిపారు.

Latest Updates