మార్కులు 921.. అయినా ఫెయిల్

mahabubnagar student km grase questions to intermediate board

ఇంటర్​ బోర్డు తీరుపై మహబూబ్ నగర్​ విద్యార్థిని ఆందోళన

మహబూబ్ నగర్, వెలుగు : మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి చెందిన కేఎమ్ గ్రేస్ ఇంటర్​ ఫస్టియర్​లో జిల్లా టాపర్.. సెకండియర్​లోనూ రాష్ట్రస్థాయిలో మంచి మార్కులు వచ్చాయి. మొత్తంగా వెయ్యి మార్కులకు గాను ఏకంగా 921 మార్కులుసాధించిం ది. కానీ మెమోలో చూసుకుంటే ఫెయిలైనట్టు వచ్చింది. అన్ని సబ్జెక్టుల్లో మంచి మార్కులు తెచ్చుకున్న ఆమెకు ఓ సబ్జెక్టులో మాత్రం చాలా తక్కువ మార్కులు కనిపిం చాయి. పరీక్ష బాగా రాశానంటున్న ఆమె.. పేపర్​ సరిగా దిద్దలేదా,మెమోలో తప్పుగా వచ్చిందా, అసలే మైందనే ఆందోళనలో మునిగిపోయింది. ఇంటర్మీడియట్ బోర్డు  నిర్లక్ష్యమే దీనికి కారణమని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఫిజిక్స్ సెకండియర్​ పరీక్షలో కేవలం 14 మార్కులు వచ్చినట్లు మెమోలో ఉందని, ఇప్పటికిప్పుడు మళ్లీ పరీక్ష పెట్టినా టాప్​మార్కులు తెచ్చుకోగలనని చెబుతోంది. ఇంటర్ ​బోర్డు విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతుందని ఆరోపించింది. హైదరాబాద్ వెళ్లి ఇంటర్ బోర్డు అధికారులను నిలదీస్తానని తెలిపింది.

Latest Updates