మేం గెలిస్తే అగ్రి చట్టాలను రద్దు చేస్తాం

బీహార్ లో తమ కూటమి అధికారంలోకి  వస్తే మొదటి అసెంబ్లీ సమావేశంలోనే 3 వ్యవసాయ చట్టాల రద్దుకు తీర్మానం చేస్తామన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత రణదీప్ సూర్జేవాలా. పట్నాలో మిత్రపక్షాలతో కలిసి మహా కూటమి మేనిఫెస్టోను ఆయన రిలీజ్ చేశారు. బీజేపీ మూడు అలయన్సులతో కలిసి పోటీ చేస్తోందని ఎద్దేవా చేశారు సూర్జేవాలా. ప్రజలు చూడగలిగే జేడీయూ కూటమి ఒకటి  అయితే.. LJP, ఎంఐఎంలతో  బీజేపీకి లోపాయికారి ఒప్పందాలున్నాయని ఆరోపించారు. బీహార్ ను 15 ఏళ్లుగా పాలిస్తున్న నితిష్ కుమార్ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ తీసుకు రాలేకపోయారన్నారు ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్. వరదలతో రాష్ట్రం అల్లాడుతున్నా కేంద్ర బృందం రాలేదని విమర్శించారు.

భారీ ఆఫర్లు..అమెజాన్, ప్లిప్ కార్ట్ లకు కేంద్రం నోటీసులు

యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం..7 మంది మృతి

Latest Updates