మ‌హ‌రాష్ట్రలో 10ల‌క్ష‌ల‌కు చేరిన క‌రోనా కేసుల సంఖ్య‌

గ‌త కొద్దిరోజులుగా రోజు 20వేల కేసులు న‌మోదు కావ‌డంతో మ‌హ‌రాష్ట్రలో క‌రోనా సోకిన కేసుల సంఖ్య ప‌దిల‌క్ష‌ల‌కు చేరిన‌ట్లు ఆరోగ్య‌శాఖ అధికారులు వెల్ల‌డించారు. దీంతో దేశంలో ఎక్కువ క‌రోనా సోకిన రాష్ట్రంగా మ‌హ‌రాష్ట్ర ‌ప్ర‌థ‌మ స్థానంలో ఉంది.

మ‌హ‌రాష్ట్ర‌లో గ‌త మూడువారాలుగా క‌రోనా కేసులు విప‌రీతంగా పెరిగాయ‌ని..రోజుకి క‌రోనా కేసులు నమోదవుతున్న వారి సంఖ్య 2శాతంగా ఉంద‌న్నారు. కానీ ఆగ‌స్ట్ చివ‌రి నాటికి క‌రోనా కేసులు న‌మోదవుతున్న వారి సంఖ్య 1.86శాతంగా ఉంద‌న్నారు.

తాజాగా రోజుకు క‌రోనా సోకుతున్న వారి శాతం 2.32శాతం ఉండ‌గా ఇది దేశంలో రోజుకి క‌రోనా సోకుతున్న‌వారి శాతం కంటే ఎక్కువ‌గా ఉన్న‌ట్లు తెలుస్తోంది.

తొలిసారి దేశంలో కంటే మ‌హ‌రాష్ట్రలో వ‌రుస‌గా మూడు నెల‌లో భారీ స్థాయిలో కేసులు న‌మోదైన‌ట్లు స‌మాచారం. ఇక పూణేలో 25శాతం కొత్త కేసులు న‌మోద‌వుతుండ‌గా..ముంబై , పూణే చుట్టుప‌క్క‌ల ప్రాంతాలైన నాసిక్, నాగ్ పూర్, రాయ్ గ‌ఢ్, జ‌ల్ గోన్, కొల్హాపూర్, పాల్గ‌హ‌ర్ ప్రాంతాల‌లో 30వేల‌కు పైగా కొత్త‌కేసులు న‌మోదైన‌ట్లు అధికారులు తెలిపారు. మ‌హ‌రాష్ట్ర‌లో ప‌ది ప్రాంతాల్లో ఎక్కువ క‌రోనా కేసులు న‌మోదువుతుంటే వాటిలో నాసిక్ ప్ర‌థ‌మ స్థానంలో ఉన్న‌ట్లు మ‌హ‌రాష్ట్ర ఆరోగ్య‌శాఖ అధికారులు తెలిపారు.

Latest Updates