పార్టీ గెలుపే లక్ష్యంగా రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం

మహరాష్ట్రలో రాహుల్ గాంధీ ప్రచార తేదీలు ఖరారైనట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. అక్టోబర్ 13,15 తేదీల్లో రాహుల్ గాంధీ మహరాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని వివరించాయి. అక్టోబర్ 13న ముంబైలో జరగనున్న బహిరంగ సభలో రాహుల్ పాల్గొంటారు. లోక్ సభ ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం ఇదే తొలిసారి కానుంది. మహరాష్ట్ర అసెంబ్లీకి అక్టోబర్ 21న పోలింగ్ జరగనుంది. 24న ఓట్లను లెక్కిస్తారు.