రాజీనామా చేయనున్న దేవేంద్ర ఫడ్నవిస్

మహారాష్ట్ర సీఎం పదవికి దేవేంద్ర ఫడ్నవిస్ ఇవాళ(శుక్రవారం) రాజీనామా చేయనున్నట్టు తెలుస్తోంది. గవర్నర్ ను కలిసి రాజీనామా లేఖను సమర్పిస్తారని సమాచారం. అయితే, పార్టీ హైకమాండ్ ఆదేశాల కోసం ఆయన ఎదురు చూస్తున్నారు. ఈ అర్ధరాత్రితో మహారాష్ట్ర అసెంబ్లీ కాలపరిమితి ముగియనుంది. సీఎం పదవికి పట్టుబడుతున్న శివసేన ప్రభుత్వ ఏర్పాటుకు కలసిరాకపోవడంతో… మహారాష్ట్రలో రాజకీయ అనిశ్చితి నెలకొంది. మరోవైపు శివసేనకు నచ్చజెప్పేందుకు బీజేపీ చేసిన ప్రయత్నాలన్నీఫెయిల్ అయ్యాయి.

Latest Updates