మా ఆయన రొమాంటిక్​: మహారాష్ట్ర సీఎంపై భార్య కామెంట్స్

ముంబై: పని ఒత్తిడి కారణంగా పైకి కాస్త గంభీరంగా కనిపించినా, మ హారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ లోలోన చాలా రొమాంటి క్ అని భార్య అమృతా ఫడ్నవిస్ చెప్పా రు. ప్రఖ్యాత మరాఠా దినపత్రిక ‘లక్మత్ ’నిర్వహించిన సమావేశానికి భర్తతో కలిసి హాజరైన ఆమె, పర్సనల్ లైఫ్​కు సంబంధించిన ఆసక్తికర విషయాలు చెప్పా రు. ‘నేను ఏ డ్రెస్ వేసుకున్నానా, హెయిర్ స్టైల్ ఎలా ఉంది, సన్నబడ్డానా , లావయ్యానా.. ఇవేవీ పట్టించుకోరు. విషయాలకు అతీతంగా వ్యక్తుల్ని ప్రేమిస్తారు. కాబట్టే నా దృష్టిలో మా ఆయన చాలా రొమాంటిక్. చాలా మందికి తెలీని సీక్రెట్​ ఏంటంటే, ఆయన ఎమోషనల్ పర్సన్ కూడా. ‘త్రీ ఇడియట్స్’ సినిమా చూసి ఎంతలా ఏడ్చారో నాకు బాగా గుర్తుంది. ఇంట్లో బిగ్ బా స్ ఆయనే అయినా నిర్ణయాలు మాత్రం నావే’అని అమృతా ఫడ్నవిస్ చెప్పుకొచ్చారు.

మధ్యలో కలుగజేసుకున్న మహారాష్ట్ర సీఎం, ఆలుమగలమధ్య సమస్యలొస్తే, ఫస్ట్​ సారీ చెప్పాల్సిన బాధ్యత భర్తలదేనని చమత్కరిం చారు. సీఎం అయినంత మాత్రాన స్పె షల్ ప్రివిలేజెస్ ఉండవని, పాపకు లీవ్ కావాలంటే తండ్రిగా తానే లెటర్ రాస్తానని చెప్పా రు. సాధారణంగా తనకు కోపం రాదని, ఎదుటివాళ్లను భయపెట్టడానికి కొన్నిసార్ లు కోపిష్టిలా యాక్ట్​ చేస్తానన్నారు. ముంబైకి షిఫ్ట్ ​అయిన తర్వాత సినిమాలు, షికార్లు బంద్​ అయ్యాయని, అందుకు తానెంతో బాధపడుతున్నానని దేవేంద్ర ఫడ్నవిస్ వివరించారు.

Latest Updates