కరోనా ఎఫెక్ట్: ఆలయాలను మూసివేసిన మహారాష్ట్ర సర్కారు

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్…ఇండియాలోకి ప్రవేశించి భయాందోళనకు గురి చేస్తోంది. ఇప్పటి వరకు మన దేశంలో మహారాష్ట్రంలో ఎక్కువగా కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలు ఎక్కువగా తిరిగే ప్రాంతాలను…సమూహాలుగా ఏర్పడే స్థలాలను మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా మహారాష్ట్రలోని పలు ఆలయాలను మూసివేశారు. ఇందులో ముఖ్యంగా ముంబైలోని సిద్ధివినాయక ఆలయానికి ప్రతీ రోజు భారీ సంఖ్యలో భక్తులు వస్తుంటారు. దీంతో ఈ ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ఆయాధికారులు ప్రకటించారు.  ఆ తర్వాత ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చే వరకు గుడి మూసే ఉంటుందని తెలిపారు. మరో ఆలయం తుల్జా భవాని ఆలయం.

ఈ రెండు ఆలయాలను (మంగళవారం) మార్చి 17 నుంచి 31 వరకూ ఆలయంలోకి ఎవరికీ ప్రవేశం ఉండదని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో ఈ రెండు ఆలయాలకు  భారీ సంఖ్యలో సంఖ్యలో భక్తులు వస్తుంటారు. కరోనా వైరస్‌ వేగంగా వ్యాపిస్తున్న ఈ సమయంలో జన సమూహాలను నివారించాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

 

Latest Updates