ఐసోలేషన్‌లో మహారాష్ట్ర గవర్నర్ కోషియారి

ముంబై: మహారాష్ట్ర గవర్నర్ భగత సింగ్ కోషియారి ఐసోలేషన్‌లోకి వెళ్లారు. గవర్నర్ హౌజ్‌లో చాలా మంది ఎంప్లాయీస్‌కు కరోనా సోకడంతో కోషియారి ఐసోలేషన్‌లో ఉండాలని నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ఒకవేళ అవసరమైతే ఆయనకు కరోనా టెస్టింగ్‌ నిర్వహిస్తామని ఓ బీఎంసీ అధికారి తెలిపారు. రాజ్‌భవన్‌లో పని చేస్తున్న ఉద్యోగుల్లో 16 మందికి కరోనా పాజిటివ్‌గా తేలారని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) తెలిపింది. బీఎంసీ అధికారుల ప్రకారం.. రాజ్‌భవన్‌లో 16 మంది ఉద్యోగుల్లో ఎనిమిది రోజుల క్రితం ఇద్దరికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. శనివారం గవర్నర్ ఆఫీస్‌కు చెందిన 100 మంది స్టాఫ్​ మెంబర్స్‌కు జేజే ఆస్పత్రిలో కరోనా పరీక్షలు చేశారు. వీరిలో 14 మందికి పాజిటివ్‌గా వచ్చిందని బీఎంసీ అధికారులు చెప్పారు.

Latest Updates