ఎన్నికల టైంలో ఫోన్ల ట్యాపింగ్

ముంబై: మహారాష్ట్రలో ఫోన్​ ట్యాపింగ్​ వివాదం ముదురుతోంది. అసెంబ్లీ ఎన్నికల టైంలో అప్పటి ఫడ్నవీస్​ సర్కారు ప్రతిపక్షాల ఫోన్లను ట్యాప్​ చేయించిందని, సైబర్​సెల్​కు ప్రత్యేకంగా ఆర్డర్స్ ఇచ్చిందని ప్రస్తుత హోంమంత్రి అనిల్​ దేశ్​ముఖ్ గురువారం ​ఆరోపించారు. దీనికోసం ప్రత్యేక సాఫ్ట్​వేర్​ కొనుగోలు చేసి తీసుకురావడానికి కొంతమంది అధికారులను ఫడ్నవీస్​ సర్కారు ఏకంగా ఇజ్రాయెల్​కు పంపించిందని చెప్పారు. వ్యక్తిగత జీవితంలోకి తొంగిచూడడం ఎంతవరకు కరెక్టని దేశ్​ముఖ్​ ప్రశ్నించారు. బీజేపీ నేతలతో తమకున్నది రాజకీయ వైరుధ్యమేనని, వ్యక్తిగతం కాదని గుర్తుంచుకోవాలన్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, రిపోర్టు ఇవ్వాలంటూ అధికారులను ఆదేశించినట్లు హోంమంత్రి చెప్పారు. శుక్రవారం దీనిపై శివసేన ఎంపీ సంజయ్​ రౌత్​స్పందించారు. తన ఫోన్​ను కూడా ట్యాప్​ చేసినట్లు బీజేపీ నేత ఒకరు వెల్లడించారని చెప్పారు. మహారాష్ట్ర వికాస్ అగాదీ(ఎంవీఏ) ఏర్పాటు చేస్తున్న టైంలో ఈ తతంగం జరిగిందన్నారు. గత ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా రాష్ట్రంలో అధికారాన్ని ఏర్పాటు చేశామని రౌత్​ తెలిపారు. దీనిని తట్టుకోలేక.. కక్ష సాధించేందుకే ఎన్సీపీ చీఫ్​శరద్​ పవార్​కు ఢిల్లీలో సెక్యూరిటీ తగ్గించారని ఆరోపించారు.  ‘నేను ఎవరితో ఏం మాట్లాడుతున్నానో వినాలనుకుంటే నాకు అభ్యంతరంలేదు. బాలాసాహెబ్​ శిష్యుడిని.. ఏంచేసినా ఓపెన్​గానే చేస్తా’ అని సంజయ్​ రౌత్​ చెప్పారు. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ సీనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేత దిగ్విజయ్‌‌‌‌‌‌‌‌సింగ్‌‌‌‌‌‌‌‌ కూడా మహారాష్ట్రలో ఫోన్‌‌‌‌‌‌‌‌ ట్యాపింగ్‌‌‌‌‌‌‌‌ జరిగిందని ఆరోపణలు చేశారు. అయితే, ఈ ఆరోపణలను మాజీ సీఎం ఫడ్నవీస్‌‌‌‌‌‌‌‌ ఖండించారు. అలా చేయడం తమ ప్రభుత్వ కల్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాదని, ఎప్పుడూ అలాంటి పనులకు పాల్పడలేదని అన్నారు. ప్రభుత్వం దానిపై విచారణ చేసుకోవచ్చని చెప్పారు.

ట్యాపింగ్​ మా సంస్కృతి కాదు: ఫడ్నవీస్

ఫోన్​ ట్యాపింగ్​ ఆరోపణలు అవాస్తవం. అది మా సంస్కృతి కానేకాదు. అలాంటి ఆర్డర్స్​ ఏవీ మా ప్రభుత్వం ఇవ్వలేదు. ప్రభుత్వం ఎలాంటి విచారణ అయిన జరిపించుకోవచ్చు. మహారాష్ట్ర ప్రజలకు నిజం తెలుసు. ఆరోపణలు చేస్తున్న వారి విశ్వసనీయత ప్రపంచానికంతటికీ తెలుసు

Latest Updates