జులై 13 నుంచి 23వరకు లాక్ డౌన్: నిత్యవసరాలకు అనుమతి

జూలై 13 నుంచి 23 వరకు పూణే , పింప్రి, చించ్ వాడ్ లో పూర్తిగా లాక్ డౌన్ విధిస్తున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆయా ప్రాంతాల్లో కరోనా వైరస్ ప్రభావం ఎక్కువ ఉన్నందు వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కరోనా కేసులు పెరిగిపోతుండడంతో  పూణే, పింప్రి,చించ్ వాడ్ తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో లాక్ డౌన్ విధించేలా నిర్ణయం తీసుకున్నట్లు  డివిజనల్ కమిషనర్  దీపక్ మైసేకర్ తెలిపారు.

కాగా గురువారం పూణేలో అత్యధికంగా 1,803 కొత్త  కేసులు నమోదయ్యాయని దీంతో మొత్తం కేసులు 34,399 కు చేరుకున్నట్లు చెప్పిన అధికారులు..పలు ప్రాంతాల్లో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు లాక్ డౌన్ విధిస్తున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

Latest Updates