మారిన మహారాష్ట్ర నవ నిర్మాణ సేన జెండా

మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (MNS) జెండాలో మార్పులు జరిగాయి. పూర్తిగా కాషాయ రంగు బ్యాగ్రౌండ్ పై  శివాజీ రాజముద్రతో ఉన్న జెండా కనిపిస్తోంది. ఛత్రపతి శివాజీ పరిపాలన సమయంలో ఈ రాజముద్రను వాడేవారు. అంతకు ముందు MNS జెండాలో కాషాయం, నీలం, ఆకుపచ్చ రంగులు ఉండేవి. నీలం, ఆకుపచ్చ రంగులను తొలగించి… MNS చీఫ్‌ రాజ్‌ థాకరే గురువారం తన పార్టీ నూతన జెండాను ఆవిష్కరించారు. వీర్‌ సావర్కర్‌, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌, ప్రబోధాంకర్‌ థాకరే, ఛత్రపతి శివాజీల చిత్ర పటాలకు రాజ్‌ థాకరే పూల మాలలు వేసి, నివాళులర్పించారు. తర్వాత మెగా ర్యాలీని ప్రారంభించారు. శివసేన వ్యవస్థాపకుడు బాల్‌ థాకరే జయంతిని ఆ పార్టీ కార్యకర్తలు ఇవాళ(గురువారం) జరుపుకున్నారు.

Latest Updates