ఒక్కరోజులో 28,637 కేసులు నమోదు

  • 8లక్షల మార్క్‌ దాటిన కేసుల సంఖ్య
  • 2.5 లక్షల చేరువలో మహారాష్ట్ర

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకి విపరీతంగా పెరిగిపోతోంది. గత తొమ్మిది రోజులుగా ప్రతిరోజు దాదాపు 22వేల కంటే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. 24 గంటల్లో 28,637 కేసులు నమోదైనట్లు కేంద్ర హెల్త్‌ మినిస్ట్రీ చెప్పింది. దీంతో ఆదివారం ఉదయానికి కేసుల సంఖ్య 8,49,553కి చేరింది. శనివారం ఒక్కరోజే 551 మంది చనిపోయారు. దీంతో చనిపోయినవారి సంఖ్య 22,674కి చేరింది. 5,34,621 మంది వ్యాధి నుంచి కోలుకోగా మరో 2,95,258 మంది హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నారు. నిన్న ఒక్కరోజే 19,235 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రికవరీ రేటు 62.78 శాతంగా ఉందని అధికారులు చెప్పారు.

రాష్ట్రాల్లో పెరిగిపోతున్న కేసులు

మహారాష్ట్రలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. కేసుల సంఖ్య రోజు రోజుకు ఎక్కువవుతోంది. మొత్తం కేసుల సంఖ్య 2.5లక్షలకు చేరువలో ఉందని అధికారులు చెప్పారు. ఇప్పటి వరకు 10,116 మంది చనిపోయారు. 1,36,985 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. తమిళనాడులో మొత్తం 1,34,226 మందికి వ్యాధి సోకగా.. 1,898 మంది చనిపోయారు. 85,915 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 1,10,921 కేసులు నమోదు కాగా.. 87,692 మంది పేషంట్లు రికవరీ అయ్యారు. 3,334 మంది చినిపోయారు. గుజరాత్‌లో 35,092, తెలంగాణలో 33,402, కర్నాటకలో 36,216, వెస్ట్‌బెంగాల్‌లో 28,453, రాజస్థాన్‌లో 23,748, ఆంధ్రప్రదేశ్‌లో 27,235 కేసులు నమోదయ్యాయి. కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో ఉత్తర్‌‌ప్రదేశ్‌, వెస్ట్‌బెంగాల్ తదితర రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ విధించారు.

Latest Updates