ముగ్గురు వ్యక్తులపై పెద్దపులి దాడి.. వీడియో వైరల్

మహారాష్ట్రలోని భండారా జిల్లాలోని ఓ గ్రామంలో పెద్దపులి ముగ్గురు వ్యక్తులపై దాడి చేసింది. శనివారం ఉదయం సమయంలో ఇద్దరు వ్యక్తులు  బైక్ పై తమ గ్రామానికి చేరుతుండగా ఓ పెద్దపులి దారిలో వారిని అడ్డగించి వారిపై దాడి చేసింది. స్వల్ప గాయాలతో ఎలాగోలా తప్పించుకున్న ఆ ఇద్దరు వ్యక్తులు గ్రామానికి వెళ్లి పులి దాడి చేసిన విషయం చెప్పారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు.. ఆ పులి ఊరి పొలిమేరలో ఉన్న పొలాల్లోనే సంచరిస్తుందని తెలుసుకొని దానిని అక్కడి నుంచి తరిమేందుకు ప్రయత్నించారు. భారీ సంఖ్యలో పొలాల వద్దకు చేరుకొని, ఆ క్రూర మృగాన్ని వెంబడించారు.

 గ్రామస్తుల్ని చూసి భయపడ్డ పులి భయంతో అక్కడ నుండి పరుగులు తీస్తూ.. అక్కడ మరో వ్యక్తిపై దాడి చేసింది. జనమంతా గట్టిగా కేకలు వేసి, దాని మీదకు రాళ్లు విసరడంతో.. బెదిరిపోయి అక్కడి నుంచి జారుకుంది.  ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పులి పారిపోయిన వెంటనే గ్రామస్తులు దాడిలో గాయపడ్డ వ్యక్తిని సిహోరాలోని ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

Latest Updates