విడాకుల కోసం భర్త సంతకం ఫోర్జరీ

  • ఇల్లు అమ్మి పాత ప్రియుడితో పెళ్లి.
  • భార్యపై ఫోర్జరీ కేసు పెట్టిన భర్త

భార్యాపిల్లలు బాగుండాలని ఎక్కడో యూఏఈ వెళ్లి కష్టపడుతున్నాడు భర్త. నెలనెలా డబ్బులు పంపిస్తున్నాడు. కానీ భార్యేమో పాత ప్రియుడికి దగ్గరైంది. భర్తను సైడ్‌ చేసి ప్రియుడిని పెళ్లిచేసుకోవాలనుకుంది. భర్త సంతకాన్నీ ఫోర్జరీ చేసి మరీ విడాకులు తీసుకుం ది. లవర్‌‌ను పెళ్లి చేసుకుని పరారైంది. పోతూపోతూ సొంతిల్లును అమ్మిడబ్బులు తీసుకెళ్లింది. భర్త చీటింగ్‌ కేసు పెట్టడంతో యాంటిసిపేటరీ  బెయిల్‌‌ కోసం ప్రయత్నిస్తోంది. యుసుఫ్‌‌ షెరిఫ్‌‌ మస్తాన్‌‌, నిలోఫర్‌‌ దంపతులు ముంబైలో ఉంటున్నారు. వాళ్లకు తొమ్మిదేళ్ల  కొడుకున్నాడు. పని కోసం మస్తాన్‌‌ 2007లో యూఏఈ వెళ్లాడు . అక్కడ మెకానిక్‌‌గా పని చేస్తున్నాడు. ఖర్చులకు డబ్బులు పంపడంతో పాటు ముంబ్రాలో ఓచిన్న ఇల్లు కొనడానికీ  సేవ్‌‌ చేశాడు. కానీ పాతబాయ్‌ ఫ్రెండ్‌ కు నీలోఫర్‌‌ దగ్గరైంది. తన పేరుతో ఇల్లు కొనమని ఒత్తిడి  చేయడంతో మస్తాన్‌‌ రూ.23లక్షలు పెట్టి ఇల్లు కొన్నాడు.

ఈ క్రమంలో ఓసారి ఇండియా వచ్చి నప్పుడు భార్య ప్రవర్తనలో తేడా గమనించాడు. తర్వాత యూఏఈ వెళ్లిన మస్తాన్‌‌ 2017లో ఇండియా వచ్చినప్పుడు అంతా అర్థమైంది. తాను  కొన్న ఇంట్లో  వేరే ఎవరో ఉన్నారు.ఎంక్వైరీ  చేస్తే రూ.32 లక్షలకు ఇంటిని నీలోఫర్‌‌ అమ్మేసిందని తెలిసింది. భర్త సంతకాన్ని ఫోర్జరీచేయడం, విడాకులిప్పించడంలో ఓ లాయర్‌‌ సాయపడ్డట్టు వెల్లడైంది. భార్యపై ఫోర్జరీ కేసు పెట్టాడు మస్తాన్‌‌. 2017 ఏప్రిల్‌‌లో మస్తాన్‌‌ డివోర్స్‌‌ పేపర్లపై సంతకం చేసినట్టు ఉందని, కానీ అతని వీసా ప్రకారం యూఏఈలో ఉన్నట్టు వెల్లడైందని, ఇది పక్కా ఫోర్జరీ అని పోలీసులు చెప్పారు.