స్టాఫ్‌కు కరోనా.. ఆసుప్రతిలో చేరిన మంత్రి

  • ముందుజాగ్రత్తగా చేరినట్లు వెల్లడించిన
  • మహారాష్ట్ర హౌసింగ్‌ మినిస్టర్‌‌

ముంబై: మహారాష్ట్ర హౌసింగ్‌ మినిస్టర్‌‌ జితేంద్ర అవద్‌ బుధవారం తెల్లవారుజామున హాస్పిటల్‌లో చేరారు. ఆయన ఆఫీస్‌లోని స్టాఫ్‌లో ఒకరికి కరోనా పాజిటివ్‌ రావడంతో 14 రోజులు సెల్ఫ్‌ ఐసోలేషన్‌కు వెళ్లిన ఆయన ములుంద్‌లోని ఒక ప్రైవేట్‌ హాస్పిటల్‌లో చేరినట్లు అధికారులు చెప్పారు. ముందు జాగ్రత్తగా ఆయన హాస్పిటల్‌లో చేరారని, కరోనా టెస్ట్‌ చేయాల్సి ఉందని అన్నారు. ఫస్ట్ టెస్ట్‌ నెగటివ్‌ వచ్చిందని, 14 రోజులు క్వారంటైన్‌లో ఉన్నా కూడా, ముందు జాగ్రత్తగా హస్పిటల్‌లో చేరానని మినిస్టర్‌‌ అన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై హాస్పిటల్‌ వర్గాలు ఎలాంటి ప్రకటన చేయలేదు. మన దేశంలోని అన్ని రాష్ట్రల కంటే మహారాష్ట్రలోనే కరోనా పాజిటివ్‌ కేసులు ఎక్కువగా ఉన్నాయి. అంతే కాకుండా ఆ రాష్ట్రంలో మరణాలు కూడా అధికంగా సంభవించాయి. ముంబైలోని ధారావిలో కూడా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. మహారాష్ట్రలోని 52 మంది జర్నలిస్టులకు, పోలీసులకు కూడా కరోనా పాజిటివ్‌ వచ్చింది.

Latest Updates