మహారాష్ట్ర ,హర్యానా మళ్లీ బీజేపీదే!

మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. రెండు రాష్ట్రాల్లోనూ ఆ  పార్టీ అత్యధిక సీట్లు సాధించింది. మహా రాష్ట్రలో బీజేపీ,శివసేన కూటమి 159 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్,ఎన్సీపీ కూటమి 105 సీట్లలో గెలిచింది. ఇక ఎంఐఎం 2,ఇతరులు 24 సీట్లు గెలుచుకున్నారు. మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. అధికారం చేపట్టాలంటే మ్యాజిక్ ఫిగర్ 145 సీట్లు కావాలి. ఇక బీజేపీ శివసేన కూటమి మళ్లీ అధికారం చేపట్టనుంది.

ఇక హర్యానాలో మొదటి నుంచి హంగ్ ఖాయమనే సంకేతాలు వచ్చాయి. అదే విధంగా ఆ రాష్ట్రంలో మొత్తం 90 అసెంబ్లీ సీట్లకు బీజేపీ 40 సీట్లలో విజయం సాధించింది. కాంగ్రెస్ 31 సీట్లు గెలుచుకుంది, జన్నాయక్ జనతా పార్టీ ( జేజేపీ) 10 సీట్లు వచ్చాయి. ఇతరులు 9 సీట్లలో విజయం సాధించారు. హర్యానాలో హంగ్ తప్పని సరి అయింది. మ్యాజిక్ ఫిగర్ 46. ఇక్కడ జేజేపీ, ఇతరుల మద్దతు కీలకం కానుంది. వారు ఎవరికి మద్దతిస్తే వారిదే అధికారం.

Latest Updates