కంగనా డ్ర‌గ్స్ లింక్ పై ద‌ర్యాప్తుకు ఆదేశించాం : హోంమంత్రి

డ్రగ్స్ తీసుకున్నారనే ఆరోపణలతో కంగనా రనౌత్ ను విచారిస్తామ‌ని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ చెప్పారు. కంగనా డ్రగ్స్ సేవించేదని, పైగా ఇది తీసుకోవాలని తనపై ఒత్తిడి కూడా చేసేదని నటుడు అధ్యాయన్ సుమన్ గ‌తంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
ఈ సంద‌ర్భంగా హోమంత్రి అనిల్ దేశ్ ముఖ్ మీడియాతో మాట్లాడుతూ కంగనా రనౌత్ పై ఎమ్మెల్యేలు సునీల్ ప్రభు, ప్రతాప్ సర్నాయక్ అభ్యర్థన ప్రకారం తాను అసెంబ్లీలో సమాధానం ఇచ్చిన‌ట్లు చెప్పారు. కంగనా డ్రగ్స్ సేవించేదని, పైగా ఇది తీసుకోవాలని తనపై ఒత్తిడి కూడా చేసేదని నటుడు అధ్యాయన్ సుమన్ వ్యాఖ్య‌లపై ముంబై పోలీసులు విచారిస్తార‌ని అన్నారు.

Latest Updates