దారుణంగా నిరాశపర్చిన మహర్షి

పండించేవాడు తగ్గిపోతున్నాడు తినేవాడు పెరిగిపోతున్నారు . రైతు అంటే సింపథీకాదు..రైతంటే రస్పెక్ట్. ఒక్క ఆడపిల్ల ఏడిస్తే ఇంటికి మంచిది కాదంటారు  మరి ఒక రైతు ఏడిస్తే దేశానికి ఎలా  అంటూ  రైతు గురించి, స్నేహం గొప్పతనం గురించి తెరకెక్కిన చిత్రం మహర్షి.  వంశి పైడిపల్లి డైరక్షన్ లో వచ్చిన  మహేష్ బాబు 25వ చిత్రం బాక్సాఫీస్ ను షేక్ చేస్తూ సుమారు రూ.100కోట్ల షేర్ పైగా పైగా కలెక్ట్ చేసింది. ఇప్పటి వరకు మహేష్  కెరియర్ లోనే  ఏ సినిమాకి రాని వసూళ్లు మహర్షికి మాత్రమే వచ్చాయి. వెండితెర మీద బాక్సాఫీస్ వద్ద భారీ ఎత్తున వసూళ్లు రాబడితే..స్ట్రీమ్ లైన్ మీడియాలో అదే తరహాలో ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. కానీ బుల్లితెర రేటింగ్ విషయంలో మహర్షి నిరాశ పరిచింది.  మహర్షి సినిమాకి బుల్లితెరపై  15 నుండీ 20 వరకూ టీఆర్పీ వస్తుందని అనుకున్నారు.  కాని  కేవలం 8.4 రేటింగ్ తో సరిపెట్టుకోవడంతో మహేష్ అభిమానులు డీలా పడ్డారు. ఇంతకు ముందు మహేష్ బాబు సినిమాలు భరత్ అనే నేను, బ్రహ్మోత్సవం, స్పైడర్ సినిమాలు సైతం  రేటింగ్ విషయంలో వెనకపడ్డాయి.  అయితే వెండితెర, స్ట్రీమ్ లైన్ లో ఆకట్టుకున్న మహర్షి ఆలస్యంగా బుల్లితెరపై విడుదల కావడంతో రేటింగ్ తగ్గినట్లు తెలుస్తోంది.

Latest Updates