మహర్షి వ్యవసాయం… మహేశ్ మాయాజాలం

ప్రిన్స్ మహేశ్ బాబు మహర్షి మూవీ పాటలు ట్రెండింగ్ లో ఉన్నాయి. బుధవారం విడుదలైన మోటివేషనల్ సాంగ్ “పదర ..పదర…”  ఆకట్టుకుంటోంది. శ్రీమణి రాసిన ఈ పాటను… మంచి జోష్ వచ్చేలా కంపోజ్ చేశాడు దేవిశ్రీ ప్రసాద్. సింగర్ శంకర్ మహదేవన్.. ఊపునిచ్చేలా పాడారు.  మహేశ్ బాబు తొలి సినిమాలో పాట పాడిన శంకర్ మహదేవన్… ఆయన 25వ సినిమాలోనూ పాట పాడాడు. ఇది తనకు సంతోషం కలిగిస్తోందని చెప్పాడు శంకర్ మహదేవ్.

పదర .. పదర… ట్యూన్ తో పాటు.. లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి. సాంగ్ రిలీజైన కొద్దిగంటల్లోనే 10 లక్షల వ్యూస్, లక్ష లైక్స్, 7వేల కామెంట్స్ క్రాస్ అయ్యాయి.

భల్లుమంటు నింగి ఒళ్లు విరిగెను గడ్డి పరకతోనా

ఎడారి కళ్లు తెరుచుకున్న వేళన చినుకు పూల వాన

సముద్రమెంత దాహమేస్తే వెతికెను ఊటబావినే

శిరస్సు వంచి శిఖరమంచు ముద్దిడె మట్టి నేలనే…

పాటలోని సాహిత్యం… హీరో లక్ష్యాన్ని.. అతడి లక్షణాన్ని వివరిస్తోంది.

తనను తాను తెల్సుకున్న హలముకు పొలముతో ప్రయాణం

తనలోని రుషిని వెలికి తీయు మనిషికి లేదు ఏ ప్రమాణం

ఉషస్సు ఎంత ఊపిరిచ్చి పెంచిన కాంతిచుక్కవో

తరాల వెలితి వెతికి తెచ్చిన వెలుగు రేఖవో

Latest Updates