ప్రపంచాన్ని ఏలుతానంటున్న ‘మహర్షి’ : ట్రైలర్ ఇదిగో

సూపర్ స్టార్ మహేశ్ బాబు 25వ సినిమా ‘మహర్షి’ ట్రైలర్ రిలీజైంది. ఇవాళ హైదరాబాద్ లో నిర్వహించిన ప్రి-రిలీజ్ ఈవెంట్ లో మహర్షి ట్రైలర్ ను విడుదల చేశారు. మహేశ్ ప్రధానంగా 3 షేడ్స్ లో కనిపించాడు. అభిమానులను ఉర్రూతలూగించాడు.

మహేశ్ బాబు స్టూడెంట్ గా.. మిలియనీర్ గా.. వ్యవసాయం చేసే రైతుగా కనిపించి.. సినిమాపై క్యూరియాసిటీ పెంచేశాడు.

“ప్రపంచం ఏలేద్దామనుకుంటున్నాను సర్..”, “మనం గతంలో ఎక్కడున్నాం..ఇప్పుడెక్కడున్నాం.. దాన్ని బట్టి మనకే అర్థమైపోతుంది.. సక్సెస్ అయ్యామా లేదా అన్నది”, “ఓడిపోతామనే భయంతో ఆటలో దిగితే ఎప్పటికీ గెలవలేం..” , “జీవితంలో గెలవడం అంటే సంపాదించడమేనా..” , “ఓడిపోవడం అంటే నాకు భయం.. ఆ భయాన్ని పరిచయం చేశావ్”  లాంటి డైలాగులు ట్రైలర్ లో ఆకట్టుకునేలా ఉన్నాయి. చివర్లో చూపించిన ఫైట్.. ఒంటిచేత్తో రౌడీని లేపే సీన్ హైలైట్ గా ఉన్నాయి.

అల్లరి నరేష్ క్యారెక్టర్ సినిమాలో ఇంపార్టెంట్ అనేది అప్పటికే మేకర్స్ చెప్పేశారు. అందుకు సంబంధించిన సీన్స్ కూడా ట్రైలర్ లో చూపించారు. కామెడీ చేసిన తనతో ఓ సీరియస్ పాత్ర చేయించారని వేదికపై నరేష్ చెప్పడంతో ఆ క్యారెక్టరైజేషన్ పై ఆసక్తి పెరిగింది.

స్టూడెంట్ మహేశ్.. మిలియనీర్ గా ఎలా మారాడు.. నాగలి ఎందుకు పట్టాడు… అల్లరి నరేశ్ కోసం మహేశ్ ఏం చేశాడు.. అనేది ఈ సినిమాలో చూడాల్సిందే. మహర్షి మే 9న విడుదల కానుంది. ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్. వైజయంతి మూవీస్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ సినిమా బ్యానర్స్ పై రూపొందిన ఈ మూవీని వంశీపైడిపల్లి డైరెక్షన్ చేశారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు.

Latest Updates