సుష్మాను చూసి బోరున ఏడ్చిన 96 ఏళ్ల బ్రాండ్ ఓనర్

విదేశాంగ శాఖ మాజీ మంత్రి సుష్మాస్వరాజ్ పార్థివదేహానికి ఆమె ఇంట్లో, బీజేపీ పార్టీ ఆఫీస్ లో ప్రముఖ నాయకులు, సెలబ్రిటీలు, పారిశ్రామికవేత్తలు నివాళులు అర్పించారు. పుష్పగుచ్చాలు ఉంచి కడసారి శ్రద్ధాంజలి ఘటించారు. సుష్మాస్వరాజ్ పార్ధివ దేహం చూసిన వెంటనే… MDH స్పైసెస్ కంపెనీ యజమాని మహర్షి ధర్మపాల్ గులాటీ బోరున ఏడ్చారు. ఆమె పాదాల వద్ద మోకరిల్లి కన్నీళ్లు పెట్టుకున్నారు.

మహర్షి ధర్మపాల్ గులాటీ వయసు 96 ఏళ్లు. MDH స్పైసెస్ కంపెనీకి  ఆయనే బ్రాండ్ అంబాసిడర్. ఆ కంపెనీ ఉత్పత్తులన్నింటిపైనా ఆయన ఫొటో ఉంటుంది. ఈ మధ్యాహ్నం బీజేపీ హెడ్ క్వార్టర్స్ కు ఆయన వస్తూనే.. బాగా ఎమోషనల్ అయ్యారు. ఆయన ఏడుస్తుంటే ఆపడం ఎవరితరం కాలేదు.

Latest Updates