గాంధీజీ సిద్ధాంతాలపైనే యూఎన్ పని చేస్తోంది

  • సత్యాగ్రహ ఉద్యమం చరిత్రనే మార్చిందన్న యూఎన్ సెక్రెటరీ జనరల్

న్యూయార్క్:  అహింసా మార్గంలో మహాత్ముడు చేసిన సత్యాగ్రహ ఉద్యమం ప్రపంచ చరిత్రను మార్చేసిందని ఐక్య రాజ్య సమితి (యూఎన్) జనరల్ సెక్రెటరీ ఆంటోనియో గ్యుటెరస్ అన్నారు.

మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా బుధవారం ఆయన నివాళి అర్పించారు. గాంధీజీ సిద్ధాంతాలే పునాదిగా యూఎన్ పని చేస్తోందంటూ ఆయన ట్వీట్ చేశారు. అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా జరుపుకొంటున్న ఆయన జయంతి నాడే కాక ప్రతి రోజూ ఆయన ఆశయాలు, ధీరత్వం మనలో స్ఫూర్తి నింపాలని అన్నారు.

Latest Updates