జబ్బులున్నా మహాత్ముడి పోరు

  • పాలు, ఇంగ్లిష్ మందులను ముట్టుకోని గాంధీజీ

మహాత్మాగాంధీ తెల్లోళ్లతోనే కాదు, తనతో తానే పోరాడిన వ్యక్తి . తన ఆరోగ్యాన్నిపట్టించుకోకుండా,దేశం కోసం తిరిగిన మహామూర్తి. మాయదారి రక్తపోటు ఏళ్ల పాటు ఆయన్ను పీడించింది. మలేరియా మూడు మార్లు దాడి చేసింది.రెండు ఆపరేషన్లు ఆయన్ను పడేయాలని చూశాయి. అయినా ఆయన ఇంగ్లీష్ మందుల జోలికి పోలేదు.డాక్టర్లను దరి చేరనివ్వలేదు. తానే స్వయంగా నేచురుపతితో ట్రీట్ మెంట్ చేసుకుంటూ ప్రయోగాలు చేసుకున్నారు. తొలిసారిగా బయటకు వచ్చాయి. ‘‘గాంధీ అండ్ హెల్త్@150’’ పేరుతో ఇండియన్ కౌన్సి ల్ ఆఫ్ మెడికల్ రీసె ర్చ్(ఐసీఎంఆర్) పుస్తకాన్ని తెచ్చింది. ఈ ఏడాది బాపూజీ 150వ జయంతి సందర్భంగా దలైలామా చేతుల మీదుగా సోమవారం ధర్మశాలలో బుక్ రిలీ జైంది. పుస్తకం ప్రకారం 1913 నుంచి 1948 మధ్య గాంధీజీ దేశవ్యాప్తంగా 79 వేల కిలో మీటర్లు నడిచారు.

మూడుసార్లు మలేరియా….

గాంధీజీ హెల్త్ రికార్డు ల ప్రకారం ఆయన చాలా జబ్బులతో బాధపడ్డారు. 1925, 1936, 1944ల్లో ఆయనకు మలేరియా వచ్చిం ది. 1919లో పైల్స్, 1924లో అపెండిసైటిస్‌‌కు ఆపరేషన్ చేయించు కున్నారు. లండన్‌ లో ఉన్నప్పుడు గుండె, ఊపిరి తిత్తులమధ్య మంటతో బాధపడ్డారు. సొంతంగా డైట్ క్రియేట్ చేసుకోవడంలో గాంధీకి సాటి ఎవరూ లేరు. రకరకాల ఆహారం తీసుకుని, తనను తాను ఎన్నోసార్లు పరీక్షించుకున్నాయన. ఎక్కువ కాలం ఉపవాసం ఉండేందుకు తరచూ ప్రయత్నిం చేవారు. ఆయన మొండితనం ప్రాణాల మీదకు తెచ్చిన సందర్భా లుకోకొల్లలు.

బాగా పె రిగిన రక్తపోటు….

1927లో గాంధీజీకి రక్తపోటు వచ్చిం ది. 1940 ఫిబ్రవరిలో పీక్ స్టేజ్‌‌కు వెళ్లిం ది. 220/110 వరకూ వెళ్లినా లెక్కచేయకుండా గాంధీ స్వతంత్ర ఉద్యమంలో తిరిగారు. ఈ సమయంలో తాను మూడు చుక్కల సర్పగంధ తీసుకుంటున్నా బీపీ ఎక్కువగా ఉంటోం దంటూ డాక్టర్ సుశీల నయ్యర్‌‌కు ఉత్తరం కూడా రాశారు. గేదె లేదా ఆవు పాలు అస్సలు తాగేవారు కాదట. భార్య కస్తూర్బా గాంధీ కోరిక మేరకు మేక పాలు తాగినట్లు పుస్తక రచయితల్లో ఒకరైన డా. అభయ్ బంగ్ తెలిపారు. ఇంగ్లి ష్ మందులు, మోడరన్ డాక్టర్లు అంటే గాంధీజీకి పడేదికాదట. నేచురోపతి ద్వారా జబ్బు నయం చేసుకునేందుకు ఇష్టపడేవారట. తనపైనే రకరకాల ప్రయోగాలు చేసుకునేవారని అభయ్ వెల్లడించారు.

ఈసీజీ నార్మల్….

1937లో గాంధీజీ తొలిసారిగా ఎలక్ట్రోకార్డి యో గ్రామ్(ఈసీజీ) తీయించు కున్నారు.హృదయ స్పం దనల్లో స్థిమితంగా ఉన్నాయి.ఆ తర్వాత రెండేళ్లలో తీసిన ఈసీజీల్లో కొన్ని మార్పులు కనిపించాయి. కానీ అప్పటి ఆయన వయసుకు చిన్నపాటి మార్పులు సహజమని డాక్టర్లు పేర్కొంటున్నారు.

Latest Updates