వెటర్నరీ డాక్టర్ ఘటనపై మహేశ్..సోషల్ మీడియాలో వైరల్

వెటర్నరీ డాక్టర్ ఘటన  దేశ వ్యాప్తంగా అందరినీ కలిచి వేస్తుంది. ఆమె కుటుంబానికి న్యాయం జరగాలంటూ  నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు బాలీవుడ్,టాలీవుడ్ సినీ ప్రముఖులు  స్పందించారు. అఘాయిత్యానికి పాల్పడిన వారిని శిక్షించాలంటూ తమ అభిప్రాయం చెప్పారు.  లేటెస్ట్ గా సూపర్ స్టార్ మహేశ్ బాబు వెటర్నరీ డాక్టర్ ఘటనపై ట్విట్టర్లో స్పందించాడు.

‘రోజులు,నెలలు, సంవత్సరాలు గడుస్తున్నా పరిస్థితి మారడం లేదు. సమాజంలో మనం విఫలమవుతున్నాం.  కేంద్ర,రాష్ట్రాలకు నా వ్యక్తిగత విజ్ఞప్తి ఏమిటంటే. ఇలాంటి నేరాలకు కఠినమైన చట్టాలు కావాలి. ఇలాంటి నేరాలకు మరణ శిక్ష విధించాలి.బాధితురాలి కుటుంబ వేదన తీరనిది. ఆమె కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్న. మహిళలందరికీ అండగా ఉంటూ  కలిసి పోరాడదాం. భారతదేశాన్ని సురక్షితంగా మార్చుకుందాం‘ అంటూ ట్వీట్ చేశారు.

మరో వైపు మహేశ్ వాయిస్ తో ఉన్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కవిత్వానికి మహేశ్ వాయిస్ ఓవర్  వినిపించాడు. అందులో మహేశ్ చెప్పిన పదాలు  ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తాయి. ఒక మహిళ పట్ల మగాడు ఎలా ఉండాలి ఏం చేయాలో చెప్పాడు.

MORE NEWS:

ఆ నలుగురే కాదు: వీళ్లు ముసుగేసుకున్న మృగాలు

మందు తాగించి : షాద్ నగర్ డాక్టర్ హత్యలో నమ్మలేని నిజాలు

Latest Updates