కరోనాపై ఎగ్జాంపుల్‌తో మహేశ్ వీడియో మెసేజ్

కరోనా వైరస్ విస్తరిస్తుండటంతో సెలబ్రిటీలు వీడియోల ద్వారా సోషల్ మీడియాలో మెసేజ్ ఇస్తున్నారు. నిన్న రామ్ చరణ్, ఎన్టీఆర్ కరోనా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి  వీడియో రిలీజ్ చేయగా ..లేటెస్ట్ గా సూపర్ స్టార్ మహేశ్ బాబు కరోనాపై ఓ ఎగ్జాంపుల్ తో  వీడియో మెసేజ్ ఇచ్చారు. ఆ వీడియోలో వరుసగా ఉన్న అగ్గిపుల్లలు ఒకదాని తర్వాత ఒకటి కాలుతుంటాయి. అలా కాలుతుండగా ఒక అగ్గిపుల్ల పక్కకు జరిగింది.  ఆ మంట అక్కడితో ఆగి మిగతావి సేఫ్ గా ఉంటాయి. మనుషులు కూడా అందరితో కలవకుండా దూరంగా ఉంటే  వైరస్ వ్యాప్తిచెందదనే ఉద్దేశంతో  పోస్ట్ చేశారు.

ప్రస్తుతం కరోనా విస్తరిస్తుండటంతో  కష్టమైన ఒకరినొకరు దూరంగా ఉండటం మంచిదన్నారు. వీలైనంతగా ఇంట్లోనే ఉండి ఆ సమయాన్ని ఫ్యామిలీకి కేటాయించాలని సూచించారు. సామాజిక జీవితాన్ని త్యాగం చేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలన్నారు. చేతులు శుభ్రంగా ఉంచుతూ..చుట్టూ ఉండే పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచాలన్నారు. అవసరమైతే శానిటైజర్ ఉపయోగించాలంటూ పోస్ట్ చేశారు.

Latest Updates