లండన్ స్టేడియంలో మహేశ్ బాబు అండ్ ఫ్యామిలీ

టీమిండియా- ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ను ఫ్యామిలీతో కలిసి చూశారు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు. వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ ను లైవ్ లో చూస్తు… అక్కడి అనుభవాలు, ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారాయన.

భార్య నమ్రతా శిరోద్కర్, కొడుకు గౌతమ్, కూతురు సితారలతో ఫారిన్ టూర్లో ఉన్నాడు మహేశ్ బాబు. ఇండియా మ్యాచ్ కోసం లండన్ లోని ఓవల్ కు వెళ్లారు వీళ్లంతా. మహర్షి సినిమా యూనిట్ లోని మరికొందరు కూడా లండన్ వెళ్లారు. డైరెక్టర్ వంశీ పైడిపల్లి కూడా మరికొన్ని ఫొటోలను అభిమానులతో పంచుకున్నాడు.

వరల్డ్ కప్ లో భారత జట్టు విజయాన్ని కాంక్షిస్తున్న అభిమానుల మధ్య నుంచి మ్యాచ్ చూడటం అద్భుతంగా అనిపిించిందని మహేశ్ బాబు చెప్పాడు. ఇటీవలే జర్మనీ టూర్ ఫొటోలు కూడా షేర్ చేశాడు మహేశ్.

Latest Updates