ఈ బుక్ పక్కా చదవాల్సిందే: సూపర్ స్టార్ మహేశ్

హైదరాబాద్: లాక్‌‌డౌన్ సమయంలో సినిమా షూటింగ్స్ లేకపోవడంతో స్టార్స్ తమకు నచ్చిన పనులు చేసుకుంటూ బిజీ అయిపోయారు. ఇంట్లో వాళ్లకు హెల్ప్ చేస్తూ అనుకోకుండా వచ్చిన ఖాళీ సమయాన్ని ఫ్యామిలీతో గడుపుతున్నారు. టాలీవుడ్ సూపర్‌‌స్టార్ మహేశ్ బాబు కూడా పలు అప్‌‌డేట్స్‌‌ను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. తాజాగా తనకు రీసెంట్‌‌గా చదివిన ఒక పుస్తకం గురించి ప్రిన్స్ ట్విట్టర్‌‌లో షేర్ చేశాడు. జయ్ శెట్టి అనే బ్రిటిష్ రచయిత రాసిన సదరు బుక్ పేరు ‘థింక్ లైక్ ఏ మాంక్’. ఈ పుస్తకం తనకు చాలా నచ్చిందని మహేశ్ ట్వీట్ చేశాడు. ‘రచయిత మీతో మాట్లాడుతున్నట్లుగా అనిపించే అరుదైన కొన్ని పుస్తకాల్లో ఇదొకటి. సాధారణంగా ఉండే ఆచరణాత్మక అంశాలున్నాయి. తప్పనిసరిగా చదవాలి.. జయ్ శెట్టి నువ్వో రాక్ స్టార్’ అని మహేశ్ ట్వీట్ చేశాడు. నెగిటివిటీ, యాంక్జైటీ, ఓవర్ థింకింగ్ నుంచి ఎలా బయట పడాలనే విషయాలపై సదరు పుస్తకంలో జయ్ చర్చించాడని చెప్పుకొచ్చాడు.

Latest Updates