సైనికుల మృతిపై సినీ సెలబ్రిటీస్ సంతాపం

హైదరాబాద్: తూర్పు లడఖ్‌లోని గాల్వన్ వ్యాలీలో ఇండియా–చైనా మధ్య జరిగిన ఘర్షణలో కల్నల్ సంతోష్ బాబు సహా పలువురు సైనికులు చనిపోయిన సంగతి తెలిసిందే. తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన సంతోష్ బాబు మృతిపై రాష్ట్ర సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. సైనికుల మృతిపై సినీ పరిశ్రమలోని ప్రముఖులు స్పందించారు. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, అజయ్​ దేవగణ్, మోహన్‌లాల్‌తో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, కాజల్ అగర్వాల్, వరుణ్ తేజ్ తమన్నా భాటియా అమరులైన సైనికులకు నివాళులు అర్పించారు.

మీ త్యాగాలు ఎప్పటికీ మా హృదయాల్లో నిలిచిపోతాయని.. మీ ధైర్య సాహసాలు, దేశభక్తికి సెల్యూట్ అని మహేశ్ బాబు ట్వీట్ చేశాడు.

చనిపోయిన సైనికుల కుటుంబాలకు హృదయపూర్వక నివాళులు అని కాజల్ అగర్వాల్ ట్వీట్ చేసింది.

ఆ సైనికుల తల్లుల బాధను మా అమ్మ అర్థం చేసుకోగలదు అని మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ ట్వీట్ చేశాడు.

Latest Updates