మహర్షిలో మహేష్, నరేష్ లుక్ అదుర్స్

హైదరాబాద్‌: వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సినిమా మహర్షి. ఈ సినిమాలోని ఓ పిక్ ను గురువారం రిలీజ్ చేసింది యూనిట్.  ‘అల్లరి’ నరేశ్‌, పూజా హెగ్డే, మహేశ్‌ కలిసి కాలేజ్‌కి వెళుతున్నట్లుగా పోస్టర్‌ ఆకట్టుకుంటోంది. సినిమాకు సంబంధించి వీరి ముగ్గురికి సంబంధించిన పూర్తి లుక్‌ ను విడుదల చేయడం ఇదే ఫస్ట్ టైం. శుక్రవారం ఉదయం 9.09 గంటలకు ‘మహర్షి’ మ్యూజికల్‌ జర్నీ ప్రారంభం కాబోతోంది. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్. సినిమాలోని ‘చోటీ చోటీ బాతే’ అనే ఫస్ట్ సాంగ్ ను 29న రిలీజ్ చేయనున్నట్లు తెలిపింది సినిమా యూనిట్. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌, పీవీపీ సినిమాస్‌, వైజయంతి మూవీస్‌ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మే 9న ‘మహర్షి’ రిలీజ్ కానుంది.

Latest Updates