మహేష్ బాబు కుటుంబం నుంచి మరో హీరో

హైదరాబాద్: టాలీవుడ్ సూపర్‌స్టార్, ప్రిన్స్ మహేష్ బాబు కుటుంబం నుంచి మరో హీరో సినిమారంగంలోకి అరంగేట్రం చేయబోతున్నాడు. మహేష్ బాబు మేనల్లుడు, తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడైన గల్లా అశోక్ త్వరలో ఓ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం కాబోతున్నారు. శమంతకమణి, దేవదాస్, భలేమంచిరోజు వంటి చిత్రాలతో సినీ అభిమానుల నుంచి ప్రశంసలు అందుకున్న యువదర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. ఈ సినిమాను నవంబర్ 10న ఉదయం 11:15 నిమిషాలకు రామానాయుడు స్టూడియోలో చాలా గ్రాండ్ మొదలుపెట్టనున్నారు. తమ సొంత నిర్మాణ సంస్థ అయిన అమర రాజా ప్రొడక్షన్ హౌస్ ద్వారా ఈ సినిమాను నిర్మిస్తుండగా, గల్లా జయదేవ్ భార్య గల్లా పద్మావతి ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించడం విశేషం. జీబ్రాన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నా ఈ సినిమాకు రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

Latest Updates