ఆర్మీ జవాన్‌గా మహేశ్.. ఫ్యాన్స్‌కు బర్త్ డే గిఫ్ట్

mahesh-babu-sarileru-nikevvaru-intro-video-released

మహేశ్ బాబు హీరోగా .. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరెక్కుతున్న సినిమా సరిలేరు నీకెవ్వరు. ఇవాళ మహేశ్ బాబు బర్త్ డే సందర్భంగా Hero Intro పేరుతో ఓ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్.  ఆర్మీ జవాన్ డ్రెస్సులో మహేశ్ బాబు ఎంట్రీ మామూలుగా లేదంటున్నారు అభిమానులు. పోకిరితో పోలీసుగా దుమ్ములేపిన మహేశ్.. ఆర్మీ జవాన్ గా తన రికార్డులు తానే బ్రేక్ చేయడం ఖాయమంటున్నారు.

సరిలేరు నీకెవ్వరు… నువ్వెళ్లే దారికి జోహారు అనే పాటను ఏవీలో బ్యాక్ గ్రౌండ్ లో వినిపించారు. సరిహద్దులో.. సెలయేళ్ల మధ్య జాతీయ జెండాను మహేశ్ బాబు తీక్షణంగా చూస్తున్న విజువల్స్ వీడియోలో చూపించారు. హీరో మనసులో దేశరక్షణ తప్ప మరో ఆలోచన ఉండదన్న హింట్ ఇచ్చారు. సరిలేరు నీకెవ్వరు వీడియో రిలీజ్ కాగానే… క్షణాల్లోనే వైరల్ అయిపోయింది. మహేశ్ ఆర్మీ జవాన్ గెటప్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

ఎఫ్2 బ్లాక్ బస్టర్ తర్వాత అనిల్ రావిపూడి తీస్తున్న సినిమా ఇదే. సంక్రాంతి బరిలో దింపుతామని ముందే ప్రకటించడంతో షూటింగ్ వేగంగా జరుగుతోంది. మహేశ్ కు మ్యూజికల్ హిట్స్ అందించిన దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు కూడా సంగీతం అందిస్తున్నారు.

Latest Updates