సూపర్ స్టార్ న్యూ లుక్ కు ఫ్యాన్స్ ఫిదా

హైదరాబాద్: కరోనా వ్యాప్తి కారణంగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు షూటింగ్స్ కు దూరంగా ఉంటున్నాడు. అలాంటి మహేశ్ తాజాగా ఓ యాడ్ షూటింగ్ లో పాల్గొన్నాడు. దీంట్లో ప్రిన్స్ లుక్ స్టన్నింగ్ గా ఉంది. షూటింగ్ లో మహేశ్ పాల్గొన్న ఫొటోను ఆయన టీమ్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫొటోలో ప్రిన్స్ కాఫీ తాగుతూ, చిట్ చాట్ చేస్తూ కనిపించాడు. ప్రముఖ సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్ అవినాశ్ గోవారికర్ నేతృత్వంలో ఈ షూటింగ్ జరిగింది.

మహేశ్ యాడ్ షూటింగ్ లో పాల్గొనడంపై ఫ్యాన్స్ హ్యపీగా ఉన్నారు. ముఖ్యంగా మహేశ్ న్యూ లుక్ ఫొటో నెట్ లో ట్రెండింగ్ అవుతుండటం వారికి మరింత సంతోషాన్ని కలిగిస్తోంది. ఈ లుక్ లో మహేశ్ చాలా యంగ్ గా, డ్యాషింగ్ గా, పెద్ద హెయిర్ స్టయిల్ తో ఆకట్టుకుంటున్నాడు. సర్కార్ వారి పాట అనౌన్స్ మెంట్ పోస్టర్ లో రివీల్ చేసిన హెయిర్ స్టయిల్ తోనే మహేశ్ కొత్త ఫొటోలో కనిపించాడు. ప్రిన్స్ వైఫ్ నమ్రతా శిరోద్కర్ సదరు ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. లీన్ బాడీ, లాంగ్ హెయిర్ తో బాస్ లుక్ చూడండంటూ నమ్రతా క్యాప్షన్ జత చేసింది. మహేశ్ న్యూ లుక్ ను చూసి సూపర్బ్, వావ్ వాట్ ఏ ఛేంజ్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Latest Updates