హైదరాబాద్ లో మహేశ్ మైనపు విగ్రహం

mahesh-babu-wax-statue-launch-in-amb-mall

హైదరాబాద్ : సూపర్ స్టార్ అభిమానులకు గుడ్ న్యూస్ సింగపూర్ లోని టుస్సాడ్స్  మ్యూజియం వాళ్లు రూపొందించిన మహేశ్ బాబు మైనపు విగ్రహాన్ని హైదరాబాద్ లోని ఏఎంబీ మాల్ లో ప్రదర్శించారు. మహేశ్ బాబు ముఖ్య అతిథిగా ఈ మైనపు విగ్రమాన్ని ఆవిష్కరించారు. తన మైనపు విగ్రహం పక్కన మహేశ్ బాబు సెల్పీ తీసుకున్నారు. మహేశ్ కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇవాళ ఒక్కరోజు మాత్రమే అభిమానుల సందర్శనం కోసం ఉంచి తర్వాత సింగపూర్ లోని మ్యూజియానికి తరలిస్తారు. టూస్సాడ్స్ వారు మ్యూజియంలో కాకుండా బయటి ప్రదేశంలో మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఇదే మొదటి సారి .

Latest Updates