సిట్ తో ముగిసిన మహేష్ భగవత్ భేటీ

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశా ఎన్ కౌంటర్ పై సిట్ సభ్యులతో మహేష్ భగవత్ భేటీ ముగిసింది. దిశా ఎన్ కౌంటర్ పై  విచారణ జరిపేందుకు సిట్ బృందం మంగళవారం చటాన్ పల్లిలో ఘటన స్థలానికి వెళ్లనుంది. మూడు దశల్లో విచారణ చేయనుంది సిట్. ఎన్ కౌంటర్ లో పాల్గొన్న అధికారులను సిట్ విచారించనుంది. ఎన్ కౌంటర్ కు దారి తీసిన పరిణామాలు, దిశ సీన్ రి కన్స్ట్రక్షన్ సమయంలో ఎం జరిగింది. ఆనే దానిపై వివరాలు సేకరించనుంది సిట్.

ఎన్ కౌంటర్ జరిగిన తర్వాత, సంఘటన స్థలంలో క్లూస్ ను సేకరించిన అధికారులతో పాటూ, పంచనామా చేసిన అధికారులను విచారించనుంది సిట్. షాద్ నగర్ పోలీసుల నుండి FIRతో పాటు, స్వాధీనం చేసుకున్న వస్తువులను సిట్ పరిశీలించనుంది.

Latest Updates