మార్చి 25న మహేష్ మైనపు విగ్రహం లాంచ్

హీరో మహేష్ బాబుకు అరుదైన గౌరవం దక్కింది. సింగపూర్‌లోని ప్రతిష్ఠాత్మక మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో మహేష్‌ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మార్చి 25న వ్యాక్స్ విగ్ర‌హాన్ని మ‌హేష్ లాంచ్ చేయ‌నున్నారు. ఒక్క రోజు మాత్ర‌మే ఈ విగ్ర‌హం AMB సినిమాలో ఉంటుంద‌ని స‌మాచారం. వ్యాక్స్ స్టాచ్యూ లాంచింగ్ ఈవెంట్‌ ని ఘ‌నంగా జ‌ర‌పాల‌ని థియేట‌ర్ యాజ‌మాన్యం భావిస్తుంద‌ట‌. అయితే ఆ మధ్య మ‌హేష్ మైన‌పు విగ్ర‌హం ఎలా ఉంటుందో చిన్న న‌మూనాతో చూపించారు శిల్పి ఇవాన్ రీస్. ఇందులో మ‌హేష్ హెయిర్ స్టైల్ స‌రికొత్త‌గా ఉండగా, ఇది అభిమానుల‌ని ఆకట్టుకుంది. ప్ర‌స్తుతం మ‌హేష్ బాబు వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న మహ‌ర్షి సినిమాతో బిజీగా ఉన్నాడు.

 

Latest Updates