తెలంగాణ అమ్మాయి నేషనల్‌ రికార్డు

నేషనల్‌ జూనియర్‌‌ అథ్లెటిక్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ అమ్మాయి మహేశ్వరి నేషనల్‌ రికార్డుతో సత్తాచాటింది. బాలికల అండర్‌‌–20 స్టీపుల్‌చేజ్‌ ఈవెంట్‌లో 10 నిమిషాల 34.10 సెకండ్ల రికార్డు టైమింగ్‌తో టైటిల్‌ను సొంతం చేసుకుంది. దీంతో 2017లో నందినీ గుప్తా  నమోదు చేసిన 10 నిమిషాల 53.91 సెకండ్ల రికార్డును అధిగమించింది. అంతేకాకుండా 12 నిమిషాల71 సెకండ్ల తన వ్యక్తిగత రికార్డును కూడా మహేశ్వరి మెరుగుపరుచుకుంది. 200 మీటర్ల పురుషుల అండర్‌‌–18 రేసును ఆతిథ్య ఏపీ స్ప్రింటర్ షణ్ముగ శ్రీనివాస్‌ 21.34 సెకండ్లలో పూర్తిచేసి.. నిసర్‌‌ అహ్మద్‌ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు. కర్ణాటక అథ్లెట్‌ శశికాంత్‌ రన్నరప్‌గా నిలిచాడు. ఇక షణ్ముగ, శశికాంత్ టైమింగ్‌ అండర్‌‌–20 ప్లేయర్ల కన్నా మెరుగ్గా ఉండటం విశేషం.

Latest Updates