మధ్యప్రదేశ్‌లో రోడ్డు ప్రమాదం : తెలంగాణ కానిస్టేబుల్ మృతి

కానిస్టేబుల్ తో పాటు నిందితుడు మృతి

మధ్యప్రదేశ్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్  కమిషనరేట్  పరిధిలోని మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ కు చెందిన కానిస్టేబుల్  తో పాటు నిందితుడు చనిపోయాడు. కేసు విచారణ కోసం బిహార్  వెళ్లిన SI రవీందర్ నాయక్ , కానిస్టేబుల్  తులసీరామ్ , మహిళా కానిస్టేబుల్  లలిత కారులో హైద్రాబాద్ వస్తున్నారు. మధ్యప్రదేశ్ లోని డిండోరి జిల్లా సమన్ పూర్  దగ్గర వీరి కారు టైర్ ఊడిపోయి ప్రమాదం జరిగింది. తలకు బలంగా దెబ్బ తగలడంతో కానిస్టేబుల్  తులసీరామ్ , నిందితుడు రమేష్  నాయక్  అక్కడే మృతి చెందారు. ఎస్సై రవీందర్ నాయక్ , మహిళా కానిస్టేబుల్  లలితకు గాయాలయ్యాయి.

మైలార్ దేవ్ పల్లి పోలీస్  స్టేషన్  పరిధిలోని కాటేదాన్ లో మైనర్  బాలికపై అత్యాచారం కేసులో నిందితుడు రమేష్  నాయక్  పరారీలో ఉన్నాడు. అతడిని పట్టుకునేందుకు మూడు రోజుల క్రితం SI రవీందర్  ఆధ్వర్యంలో టీమ్ బిహార్  వెళ్లింది. 2018 బ్యాచ్ కి చెందిన తులసీరామ్  స్వస్థలం రంగారెడ్డి జిల్లా ధరూర్ . కానిస్టేబుల్  మృతిపై సైబరాబాద్  సీపీ సజ్జనార్  విచారం వ్యక్తం చేశారు. మృతుని కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పారు సీపీ.

Latest Updates