షాద్ నగర్ లో హై అలర్ట్: మెయిన్ రోడ్డులో షాపుల బంద్

కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తుండడంతో రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. స్థానిక పోలీసులు మెయిన్ రోడ్, విజయనగర్ కాలనీ తదితర ప్రాంతాల్లో ఏలాంటి రాకపోకలు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. మెయిన్ రోడ్ లోని వ్యాపార సంస్థలను పోలీసులు మూసి వేయిస్తున్నారు. మెయిన్ రోడ్డు, గంజ్ ప్రాంతాల్లో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ లను బంద్ చేయించారు. షాద్ నగర్ పట్టంలోని ఈశ్వర్ కాలనీ లో మరో వ్యక్తికి కరోనా లక్షణాలు ఉండటంతో  ముందస్తు జాగ్రత్తగా కరోనా పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు వైద్యాధికారులు. కంటోన్మెంట్ జోన్ ను సందర్శించిన శంషాబాద్ డీసీపీ ప్రకాశ్ రెడ్డి వివరాలు అడిగి తెలుకున్నారు.

Latest Updates