సింహాలు గుంపుగా రోడ్డుపై వెళ్లడం చూశారా?

సింహం సింగిల్‌గా వస్తుంది.. ఇది చాలా పాపులర్ డైలాగ్. సామాన్యంగా మగ సింహాలు ఎప్పుడూ మందగా చేరవు. అడవిలో వాటికంటూ ఒక రాజ్యాన్ని ఏలుతుంటాయి. అందుకే సింహాన్ని మృగరాజు అంటారు. కానీ సింహాలు కూడా గుంపులుగా వస్తాయ్ అని ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. ఐఏఎఫ్ ఆఫీసర్ సుశాంత నందా తన ట్విట్టర్ అకౌంట్‌లో తొమ్మిది సెకన్ల వీడియోను ‘ది ఒరిజినల్ క్యాట్‌వాక్’ అనే క్యాప్షన్‌తో షేర్ చేశారు. రోడ్డుపై ఠీవీగా నడిచి వెళ్తున్న సింహాలను చూసి నెటిజన్లు ఫిదా అయిపోయారు. పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే సింహాల గుంపు వీడియో వైరల్ అయిపోయింది.

భారీగా ఈ ట్వీట్‌ను షేర్ చేస్తున్నారు నెటిజన్లు. అయితే కొందరు ఈ వీడియో గ్రాఫిక్స్ చేసిందేమోనని అనుమానం వ్యక్తం చేశారు. మగ సింహాలు గుంపుగా చేరడం ఎప్పుడూ చూడలేదని కామెంట్లు చేశారు. దీంతో ఐఏఎఫ్ నందా స్పందిచారు. తన దగ్గర ఫుల్ వీడియో ఉందంటూ దాన్ని ట్వీట్ చేశారు. ఇది ఎడిట్ చేసినది కాదని, నిజమేనని చెప్పారు. అయితే ఇది జరిగింది అడవిలో కాదని, సౌతాఫ్రికాలోని ఓ సఫారీ పార్కులో అని తెలిపారు.

Latest Updates