మజిలీ దర్శకుడి జీవితంలో ఓ బుజ్జి మలుపు

Majili director Shiva Nirvana blessed with a baby boy

నిన్ను కోరి సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయమైన శివ నిర్వాణ తాజాగా తన రెండో చిత్రం మజిలీ తో మరో హిట్ సొంతం చేసుకున్నాడు. ఈ సినిమా విజయంతో గాల్లో తేలిపోతున్న శివ.. గత రాత్రి ట్విటర్ వేదికగా మరో సంతోషకరమైన వార్తను అభిమానులకు తెలియజేశారు.

ఇటీవల తనకు పండంటి మగబిడ్డ జన్మించినట్టు ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. ‘ఇటీవలే నాకు కొడుకు పుట్టాడు. నా మజిలీలో ఒక బుజ్జి మలుపు. ఇంతకు మించి ఇంకేమీ అడగొద్దు’ అని శివ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. శివ తండ్రైన సందర్భంగా ఆయనకి సమంత, నాగచైతన్య లు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.

Latest Updates