బోయిన్ పల్లి కెమికల్ గోడౌన్ లో భారీ అగ్నిప్రమాదం

సికింద్రాబాద్: బోయిన్ పల్లి లో ని చిన్న తోకట్టలో ని కెమికల్ గోడౌన్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదం గురించి తెలుసుకున్న ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలార్పే ప్రయత్నం చేస్తోంది. చుట్టు పక్కల నివాస స్థలాలు లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ప్రమాదం ఎలా జరిగిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. గోడౌన్ యజమాని విక్రమ్ అందుబాటులో లేకపోవడంతో ప్రమాదం గురించి పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. మొత్తానికి ఎండలు మొదలు కాగానే ఇలాంటి సంఘటనలు జరుగుతుండటంతో అధికారులు జాగ్రతలు తీసుకోవాలని చెబుతున్నారు.

Latest Updates