పుల్వామా దాడి: సక్సెస్ మీట్ ను రద్దు చేసుకున్న కంగన

పుల్వామా దాడి విషయంలో దేశం మొత్తం ముక్త కంఠంతో ఖండించింది. ఈ ఘటనలో అమరులైన కుటుంబాలను ఆదుకోవడానికి పలువురు తమ వంతు సహాయం అందిస్తున్నారు. తెలంగాణ ముఖ్య మంత్రి కేసీఆర్ తన పుట్టిన రోజు వేడుకలను జరుపవద్దని కోరారు. శనివారం కేటీఆర్ తన వంతుగా 25 లక్షల రూపాయలను అమరుల కుటుంబాలకు అందిస్తున్నట్లు తెలిపారు.

ప్రముఖ హీరో విజయ్ దేవరకొండ తనకు తోచినంత ఆర్థిక సహాయాన్ని CRPF కు అందిస్తున్నట్లు తెలిపారు. అది ఎంత మొత్తం అనేది రహస్యంగా ఉంచారు. దీంతో పాటే.. బాలీవుడ్ క్వీన్ గా పేరుతెచ్చుకున్న కంగన రనౌత్.. తన మణికర్ణిక సక్సెస్ మీట్ ను రద్దు చేసుకుంది. ఈ విషయం పై కంగనను అభినందించారు ఆర్మీ మేజర్  సురేంద్ర పునియా.

‘కంగనా మీకు సలాం. ప్రాణాలు కోల్పోయిన సైనికుల పట్ల కేవలం వారి కుటుంబాలకే కాదు ఆ బాధ యావత్ భారతదేశానికి ఉంటుందని మీరు తీసుకున్న ఈ నిర్ణయం గుర్తు చేసింది. ఇంత దారుణం జరిగినప్పటికీ మన దేశంలో ఎలాంటి జోకర్లు ఉన్నారంటే పాకిస్తాన్‌ ఎంబసిలో కూర్చుని జిహాదీలతో కలిసి బిర్యానీలు తింటూ మజా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు’ అని ట్వీట్ చేశారు మేజర్ సురేంద్ర పునియా.

Latest Updates