మకరజ్యోతి రూపంలో దర్శనమిచ్చిన అయ్యప్ప స్వామి

సంక్రాంతి పర్వదినాన శబరిమలలో మకరజ్యోతి దర్శమిచ్చింది. పొన్నాంబలమేడు కొండపై అయ్యప్ప స్వామి జ్యోతి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. జ్యోతిని కనులారా వీక్షించిన భక్తులు తన్మయత్వంతో పులకించి పోయారు. మకర జ్యోతి దర్శనమివ్వగానే అయ్యప్ప శరణుఘోషతో శబరిగిరులు మార్మోగిపోయాయి. మకరజ్యోతి దర్శనం కోసం శబరిగిరులకు భక్తులు పోటెత్తారు. జ్యోతి దర్శనం నేపథ్యంలో ట్రావెన్‌కోర్ దేవస్థానం భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు  చేశారు.  పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వేలాదిగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Makara jyothi appears at sabarimala ayyappa temple

Latest Updates