రైతుల కంట రక్తపు కన్నీళ్లు పెట్టిస్తున్నారు

న్యూఢిల్లీ: ప్రధాని మోడీ గవర్నమెంట్ రైతుల కంట రక్తపు కన్నీళ్లు వచ్చేలా చేస్తోందని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ విమర్శించారు. కేంద్రం రాజ్య సభలో రెండు కొత్త వ్యవసాయ బిల్లులను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. మూజు వాణి ఓటుతో ఈ బిల్లులు ఆమోదం పొందాయి. ఈ నేపథ్యంలో వీటిపై రాహుల్ కామెంట్ చేశారు. ప్రభుత్వం రైతులకు డెత్ వారెంట్ జారీ చేసిందని దుయ్యబట్టారు. ‘రైతులు భూమిలో బంగారాన్ని పండిస్తారు. అలాంటి రైతుల కంట మోడీ సర్కార్ నెత్తుటి కన్నీళ్లు వచ్చేలా చేస్తోంది. రాజ్య సభలో రెండు బిల్లులను ఆమోదించడం ద్వారా ప్రభుత్వం ఫార్మర్స్‌‌కు మరణ శాసనాలను జారీ చేసిన విధానానికి ప్రజాస్వామ్యం సిగ్గు పడి ఉంటుంది’ అని రాహుల్ ట్వీట్ చేశారు.

Latest Updates