విగ్రహం కూల్చివేతపై ఉద్యమాన్ని వేడెక్కిస్తాం: చెన్నయ్య

హైద్రాబాద్ పంజాగుట్ట అంబెడ్కర్ విగ్రహ కూల్చివేత పై జాతీయ స్థాయిలో ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య తెలిపారు . దేశవ్యాప్తంగా ఉన్న దళితలను ఐక్యం చేయడంతో పాటు…  ఈ నెల 25న రెండు తెలుగు రాష్ట్రాల దళిత సంఘ నాయకులతో ఉస్మానియా విశ్వవిద్యాలయం ఠాగూర్ ఆడిటోరియంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు ఆయన హైద్రాబాద్ లో పేర్కొన్నారు.

విగ్రహ కూల్చివేత ఘటనలో ఉన్నతాధికారులపై వేటు వెయ్యకుండా… కింది స్థాయి ఉద్యోగులపై చర్యలు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం చేతులు దులుపుకుందని ఆయన మండిపడ్డారు. రాజ్యాంగ నిర్మాత అంబెడ్కర్ విగ్రహాన్ని చెత్తను తరలించే వాహనంలో ముక్కలు ముక్కలు చేసి తీసుకెళ్లి దళితులను తీవ్ర అవమానానికి గురి చేశారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ జోక్యం చేసుకొని అదే స్థలంలో అంబెడ్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించాలని… లేని పక్షంలో దళితుల ఆగ్రహానికి గురికాక తప్పదని చెన్నయ్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Latest Updates